యూరియా కోసం క్యూలైన్‌లో బీరు సీసాలు

MDK: గత కొంత కాలంగా యూరియా కోసం రైతులు పడి గాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఎరువుల షాప్ వద్ద రైతులు ఎగబడుతున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా రైతులు క్యూలైన్‌లో వేచి ఉంటున్నారు. కాగా, చాలా చోట్ల క్యూలైన్‌లో మనుషులు, చెప్పులతో క్యూలైన్ కట్టడం చూశాం కానీ, తొగుటలో, కాన్గల్ గ్రామాల్లో యూరియా కోసం మద్యం సీసాలు క్యూలైన్‌లో పెట్టిన ఘనట నెలకొంది.