మత్స్యకారుల జోలికి వస్తే ఊరుకోం: చంద్రబాబు
AP: ప్రపంచంలోనే తెలుగువాళ్లను నెంబర్ వన్‌గా మారుస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. సూర్యలంక బీచ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని, సముద్రం మత్స్యకారుల సొంతం.. చేపల వేటే వాళ్ల ఆధారమని తెలిపారు. ఆంధ్రా తీరంలోకి తమిళ జాలర్లు వస్తే ఉపేక్షించేది లేదన్నారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బకొడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బయట బోట్లు ఏపీ తీరంలోకి వస్తే ఉపేక్షించమన్నారు.