'ఆడపిల్లల్ని రక్షించటం ప్రతి ఒక్కరి బాధ్యత'

'ఆడపిల్లల్ని రక్షించటం ప్రతి ఒక్కరి బాధ్యత'

GNTR: ఆడపిల్లలను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అంగన్వాడీ మందడం సెక్టార్ సూపర్వైజర్ శ్రీలత అన్నారు. తుళ్లూరు మండలం రాయపూడిలోని అంగన్వాడీ కేంద్రంలో జరిగిన "బేటి బచావో బేటి పడావో" కార్యక్రమంలో భాగంగా బుధవారం శ్రీలత మాట్లాడారు. కౌమార బాలికలకు ఆహారం, భద్రతతో పాటు లింగ వివక్షత ఎదుర్కొనకుండా జాగ్రత్త వహించాలన్నారు.