వైసీపీ కోటి సంతకాల సేకరణ

వైసీపీ కోటి సంతకాల సేకరణ

కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో ఉయ్యూరులోని 4, 5వ వార్డుల్లో ఆదివారం రాత్రి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య హక్కును హరించే ఈ ప్రైవేటీకరణ అన్యాయమని తెలిపారు. సామాన్య ప్రజలకు వైద్యసేవలు అందించే ప్రభుత్వ కళాశాలల ప్రైవేటీకరణను తాము అంగీకరించబోమని వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.