బార్ ముందు స్థానికులు ఆందోళన.. పోలీసుల బందోబస్త్
NLR: నెల్లూరు నగరంలోని జాతీయ రహదారి సమీపంలో దీని దయాల్ నగర్ వద్ద ఇటీవల కంటైనర్లో బార్ని ఏర్పాటు చేయడం విమర్శలకు తావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్థానికులు సోమవారం ఉదయం బార్ వద్ద ఆందోళన చేపట్టారు. బహిరంగంగా షామియాలు వేసుకొని బార్ నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడుతున్నారు.