బోయలగూడెంలో ఉచిత కంటి శిబిరం

బోయలగూడెంలో ఉచిత కంటి శిబిరం

GDWL: గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామంలో సర్పంచ్ ఓంకార్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం మంగళవారం నిర్వహించగా సుమారు 150 మందికి పరీక్షలు చేశారు. 40 మందిని శస్త్రచికిత్స కోసం ఎంపిక చేసినట్లు వైద్యులు రూప, చంద్రశేఖర్ తెలిపారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.