కొత్తలిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

కొత్తలిలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

AKP: ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్ విగ్రహాన్ని నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ పరిపాలన సాగించినట్లు పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు ఆధ్యుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో టీడీపీ శ్రేణులు నడవాలన్నారు.