అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
ATP: గుత్తిలోని అన్న క్యాంటీన్‌ను మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ల ద్వారా ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. మెనూను కచ్చితంగా పాటించాలని, భోజనం శుచిగా, రుచిగా, సమయపాలనతో అందించాలన్నారు.