ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన సర్పంచ్
HNK: ఐనవోలు మండలం నందనం గ్రామంలో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని మంగళవారం సర్పంచ్ జెట్టబోయిన రాజు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శిబిరంలో అందిస్తున్న ఉచిత వైద్య పరీక్షలు, సలహాలు, మందులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.