VIDEO: చెన్నూరులో పడకేసిన పారిశుద్ధ్యం
KDP: చెన్నూరులోని బెస్త కాలనీ నుంచి అరుంధతి నగర్కి వెళ్లే సబ్ వే వద్ద పారిశుద్ద్యం పూర్తిగా పడకేసింది. దారి పొడవునా ప్లాస్టిక్ కవర్లు, ఇతర వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారాయి. ఈ చెత్త వల్ల రోగాలు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పేరుకుపోయిన చెత్తను తొలగించి, సబ్వేను శుభ్రపరచాలని ప్రజలు కోరుతున్నారు.