పోలింగ్ బూత్‌ను తనిఖీ చేసిన ఎస్ఐ, ఎమ్మార్వో

ప్రకాశం: కారంచేడులో సాగునీటి సంఘాల ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్‌ను మండల ఎస్ఐ వెంకట్రావు, ఎమ్మార్వో అనిత శనివారం సందర్శించారు. పోలింగ్ బూత్ పరిసరాలను పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు.