పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం: MPDO
CTR: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని MPDO అప్పాజీ కోరారు. ఈనెల 21న (ఆదివారం)జాతీయ పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ స్థానిక మండల కార్యాలయంలో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. PHC డాక్టర్ సృజన పాల్గొన్నారు.