జీవామృతాల తయారీపై శిక్షణ
KRNL: ప్రకృతి వ్యవసాయంలో చీడపీడల నియంత్రణకు ఘనజీవామృతం, ప్రవజీవామృతం ఉపయోగకరమని ఇవాళ తుగ్గలి మండల వ్యవసాయాధికారి సురేష్ బాబు తెలిపారు. రాంపల్లి క్రాస్ రోడ్డుకు సమీపంలోని రైతు రామానుజన్ పొలంలో రైతుసేవా కేంద్రాల సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవామృతాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపించి, సిబ్బందితో తయారు చేయించారు.