కంభం మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కంభం మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాగార్జున రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు మళ్ళీ సీఎం గా జగనన్ననే కోరుకుంటున్నారని తెలిపారు. కావున ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని గిద్దలూరును అభివృద్ధి చేస్తానని తెలిపారు.