VIDEO: తిరుపతిలో మరోసారి చిరుతపులి కలకలం
TPT: తిరుపతి నగరంలో మరోసారి చిరుత కలకలం రేపింది. మంగళం రోడ్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చిరుత ప్రత్యక్షమైంది. ఇంటి ముందున్న కుక్కపై దాడి చేసింది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.