వర్ధన్నపేట 108 అంబులెన్స్ ఆకస్మిక తనిఖీ

WGL: వర్ధన్నపేట మండలంలోని 108 అంబులెన్స్‌ను జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఎస్.కె నజీరుద్దీన్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో మెడిసిన్, ఆక్సిజన్ సదుపాయాలు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచాలని, పరికరాలను సమయానికి పరీక్షించాలని ఆయన సూచించారు. ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు త్వరితగతిన స్పందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.