తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉధృతి

తాలిపేరు ప్రాజెక్టులో వరద ఉధృతి

BDK: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 21,387 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి, 20,759 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. లోటు ఎత్తు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.