ప్లాస్టిక్ వినియోగిస్తున్న దుకాణాలకు జరిమానాలు
ఖమ్మం: నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న షాపులపై ప్రత్యేక కేఎంసీ అధికారులు శుక్రవారం విసృత తనిఖీలు నిర్వహించారు. గాంధీ చౌక్, జడ్పీ సెంటర్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీలలో మొత్తం రూ.1,06 లక్షల జరిమానాలు విధించారు. అదే విధంగా 50 కిలోల పైగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.