‘పాక్‌ కథ నాలుగు రోజుల్లోనే తేలిపోతుంది’

‘పాక్‌ కథ నాలుగు రోజుల్లోనే తేలిపోతుంది’

యోగా గురు బాబా రాందేవ్‌ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యుద్ధం వస్తే పాక్ కథ నాలుగు రోజుల్లోనే తేలిపోతుందని అన్నారు. ఆ దేశం అంతర్గత కలహాలతో సతమతమవుతోందని ఆయన చెప్పారు. బలూచ్ ప్రజలు స్వాతంత్య్రం కోసం పాక్‌ను డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ భారత్‌తో యుద్ధం వస్తే పాకిస్థాన్ ఓడిపోతుందని ఆయన స్పష్టం చేశారు.