VIDEO: సిర్గాపూర్ PHC ఎదుట బాధితుల ఆందోళన..
SRD: సిర్గాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట శనివారం అర్ద రాత్రి స్థానిక బాధితులు ఆందోళనకు దిగారు. రోడ్డు ప్రమాదంలో దెబ్బలు తగిలి రాత్రి పూట అత్యవసర వైద్యం కోసం వస్తే, బాధ్యతగల వైద్యులు లేక సరైన వైద్యం అందలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సిర్గాపూర్ ఆస్పత్రిలో డాక్టర్ లేరు.. వైద్యం కోసం వస్తే గేట్లకు తాళాలు వేస్తున్నారని నినాదాలు చేశారు.