అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రికి లేఖ

అధికారులపై చర్యలు తీసుకోవాలని మంత్రికి లేఖ

NZB: జిల్లాలో కొన్ని సహకార సంఘాలలో అవినీతికి బాధ్యులైన అధికారులు, కమిటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ సుంకెట అన్వేష్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ రాశారు. రైతుల ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సహకార సంఘాలు బీఆర్​ఎస్​ హయాంలో అవినీతిలో కూరుకుపోయాయన్నారు.