ఇరు పార్టీలకు ఒకే అభ్యర్థి
NGKL: ఎన్నికలు అంటేనే ప్రధాన పార్టీల మద్య పోరు జరుగుతుంటుంది. కానీ, బల్మూర్ మండలం రామోజీపల్లి గ్రామంలో మాత్రం ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి వంశీ అనే అభ్యర్థిని బరిలోకి దించాయి. మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేపట్టాయి. ఈ సన్నివేశాలు చూసిన గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.