పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
NGKL: బిజినేపల్లి మండలం వసంతపూర్ గ్రామంలో సోమవారం వెటర్నరీ డాక్టర్లు పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా పశువులు రోగాల బారిన పడకుండా ప్రభుత్వం ఈ ముందస్తు చర్యలు చేపట్టిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. పశువుల ఆరోగ్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని పశు వైద్యాధికారులు తెలిపారు.