యలమంచిలి ఎంపీపీగా శేషగిరిరావుకు ఏకగ్రీవం
AKP: యలమంచిలి ఎంపీపీగా రాజాన సూర్య చంద్ర శేషగిరిరావు గురువారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రిసైడింగ్ అధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలకు నిర్ణీత సమయానికి నలుగురు ఎంపీటీసీలు మాత్రమే హాజరయ్యారు. వారిలో శిలపారాశెట్టి ఉమా శేషు పేరును ప్రతిపాదించగా, నాగిరెడ్డి అమ్మాజీ, బర్రె శివలక్ష్మి సమర్థించడంతో ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తైంది.