వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు
ASR: డుంబ్రిగూడ మండలంలోని చాపరాయి జలపాతం సమీపంలో సోమవారం స్థానిక పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. వాహన పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించి, వాహనాలను విడిచిపెట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.