తుది శ్వాస విడిచిన అమలాపురం డిప్యూటీ ఎంపీడీవో

కోనసీమ: అమలాపురం మండల డిప్యూటీ ఎంపీడీవోగా పనిచేస్తున్న బడుగు మంగాదేవి(55) కన్ను మూసారు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆమె గతంలో పంచాయితీ కార్యదర్శి, ఈపీవోఆర్డీగా పనిచేశారు.