ఈ ఏడాదిలో రూ.4.17 కోట్ల గంజాయి స్వాధీనం

HYD: రైలు ద్వారా మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు సికింద్రాబాద్ RPF చేపట్టిన ఆపరేషన్ నార్కోస్‌లో భాగంగా ఈ ఏడాది 70 కేసుల్లో రూ.4.17 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం చేసుకొని, 84 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇక 2024లో 69 కేసుల్లో రూ. 4.42 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకొని, 82 మందిని పట్టుకున్నట్లు డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ ఆళకుంట నవీన్ తెలిపారు.