రైతులకు నష్టపరిహారం వడ్డీతో సహా చెల్లిస్తాం: కలెక్టర్
KMM: సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో వారు సమావేశమయ్యారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా పరిహారం అందిస్తామని చెప్పారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు.