ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి: MLC కవిత
ADB: ఆదివాసీల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మావలలోని కొమురం భీం కాలనీలో సోమవారం రాత్రి ఆమె పర్యటించారు. కాలనీ వాసులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి స్థలాలకు పట్టాలు, నీళ్లు, కరెంటు, విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.