VIDEO: మెయిన్ పైపులైను నుంచి వృధాగా తాగునీరు
SKLM: శ్రీకాకుళం కొత్త బ్రిడ్జి వద్ద తాగునీరు వృథాగా పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మేరకు డే అండ్ నైట్ జంక్షన్ పరిధిలో కొత్త బ్రిడ్జికి ఆనుకొని ఉన్న తాగునీటి మెయిన్ పైపులైను పగిలి నీరు పోతోంది. సరైన మరమ్మతులు చేపట్టకుండా అధికారులు అలానే వదిలేశారని పలువురు అంటున్నారు. దీనిపై శాఖాధికారులు చర్యలు తీసుకొని పైపులైను బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.