ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్
NTR: విజయవాడ సెంట్రల్‌లోని గులాబీ తోటలో సోమవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. పింఛన్ పంపిణీ విధానాన్ని పరిశీలించి, లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు పారదర్శకంగా, గౌరవప్రదంగా ఇంటివద్దకే అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.