ఉంగుటూరు మండలంలో కలెక్టర్ పర్యటన

ELR: ఉంగుటూరు మండలంలో మంగళవారం ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి పర్యటించారు. ఈ సందర్భంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు, గొర్రెలకు వాక్సిన్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. విన్నూత్నరీతిలో ఉద్యానవన పంటల సాగు అభినందనీయమన్నారు. అలాగే గొర్రెల, మేకల వంటి పశు వైద్య సేవలకు 1962 టోల్ ఫ్రీ నెంబర్‌పై విస్తృత అవగాహన కలిగించాలన్నారు.