రామచంద్రపురంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

MDK: రామచంద్రపూరం డివిజన్ కానుకుంట పరిధిలోని షాబాద్ హోటల్ ముందు గుర్తు తెలియని వ్యక్తి పడియాడు. వెంటనే స్థానికులు 108, డయల్ 100కి సమాచారం అందించారు. పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. అతని వద్ద ఆచూకీ కోసం చూడగా ఎలాంటి ఆధారాలు కనిపించలేదు. మృతుడు సుమారు 55 నుంచి 65 సంవత్సరాలు ఉండవచ్చని స్థానికులు తెలిపారు.