'సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ సాధనకు పోరాటం సాగించాలి'

BHNG: కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సమ సమాజ ఆశయ సాధనకు పోరాటం సాగించాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సంస్మరణ సభకు హాజరై వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సురవరం నేతృత్వంలో పనిచేసిన అనేక మంది విద్యార్థి, యువజన నేతలు, రాజకీయ నేతలు ఎదిగారన్నారు.