వ్యక్తి దారుణ హత్య
BDK: కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో ఆదివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్ రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.