ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

NZB: పోతంగల్ మండలంలోని సుంకిని గ్రామంలో ఇవాళ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. మూడు నెలల పైబడిన ఆవు, గేదె జాతి పశువులకు ఈ టీకాలు వేసి, వ్యాధుల పట్ల రైతులకు అవగాహన కల్పించారు. పశువుల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు హన్మంతు, సర్పంచ్, ఉప సర్పంచ్ ఉన్నారు.