సీనియర్ సిటిజన్స్ చట్టాలపై అవగాహన

HNK: కాజీపేట మండల కేంద్రంలోని సహృదయ అనాధ వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్ చట్టాల అమలుపై జిల్లా న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు వృద్ధులకు అవగాహన కల్పించారు. శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆశ్రమంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్ అనిత రెడ్డి పాల్గొన్నారు.