గుడి ప్రతిష్టకు రావాలని మంత్రి రవికుమార్‌కు ఆహ్వానం

గుడి ప్రతిష్టకు రావాలని మంత్రి రవికుమార్‌కు ఆహ్వానం

బాపట్ల: కొరిశపాడు మండలం అనమనుమూరు గ్రామంలో ఈనెల 26న అంకమ్మ తల్లి గుడి, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు జంపు హరిబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులు మంత్రి రవికుమార్‌ను కలిశారు. ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా వారు ఆహ్వాన పత్రికను అందజేశారు. గుడి యొక్క విశిష్టతను మంత్రికి వివరించారు.