'ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం పనికిరాదు'

'ప్రజలకు సేవలు అందించడంలో జాప్యం పనికిరాదు'

PPM: ప్రజలకు సత్వర సేవలు అందించడమే సచివాలయం ప్రధాన ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సత్వర సేవలు అందించడంలో జాప్యం వహించరాదని తేల్చిచెప్పారు. మంగళవారం సాలూరు పట్టణంలోని సచివాలయాన్ని జేసీతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు.