బుడమేరు రెగ్యులేటర్ గేట్లు పరిశీలించిన కలెక్టర్ డా.జి.లక్ష్మీశ

NTR: జి. కొండూరు మండల పరిధిలోని వెలగలేరు వద్ద దెబ్బతిన్న బుడమేరు హెడ్ రెగ్యులేటర్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇరిగేషన్ శాఖ అధికారులు రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ ఛానెల్‌కు ఉన్నసైఫన్లను తనిఖీ చేసి, అక్కడ తలెత్తిన సమస్యలను తెలుసుకున్నారు. సమస్య పరిష్కరించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.