లబ్ధిదారుడికి CMRF చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కృష్ణా: చాగంటిపాడు గ్రామానికి చెందిన అవుతు మణికంఠ, వెంకట శివారెడ్డికి మంజూరైన రూ.62,816/- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా లబ్ధిదారుని గృహానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, కష్టం సమయంలో ప్రభుత్వ సహాయం ప్రజలకు భరోసా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.