బీట్ ఆఫీసర్ సస్పెండ్
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని గోవిందపురం గ్రామంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఉన్న శోభన్‌ను సస్పెండ్ చేసినట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి రవి కిరణ్ తెలిపారు. పోడుదారులతో కుమ్మక్కై అడవిని నరికి వేయడంలో సహకరిస్తున్నాడనే ఆరోపణలపై విచారణ జరిపి ఈ చర్య తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.