శునకానికి వినతి పత్రం అందజేసిన సీపీఐ (ఎంఎల్) నాయకులు
BDK: ఇల్లందు మండలం ఎల్లాపురంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుల ఆధ్వర్యంలో సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. తుఫాను నష్టంపై అధికారుల స్పందన లేకపోవడంతో రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నాయకులు కుక్కకు వినతిపత్రం అందజేశారు. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతోనే ఈ విధంగా నిరసన తెలిపామన్నారు.