సురక్షిత ప్రసవాల కోసం కృషి చేయాలి: కలెక్టర్

సురక్షిత ప్రసవాల కోసం కృషి చేయాలి: కలెక్టర్

SRD: సురక్షిత ప్రసవాలు, మాతృ-శిశు మరణాల నివారణే లక్ష్యంగా వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. మెడికల్ కళాశాలలో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన టీకాలు మరియు పోషకాహారం అందేలా చూడాలని సూచించారు. మాతృ మరణాలను సున్నాకి తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.