నేడు మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ

నేడు మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతల స్వీకరణ

TG: మంత్రిగా అజారుద్దీన్ ఇవాళ బాధ్యతలను స్వీకరించనున్నారు. మైనారిటీ సంక్షేమం, ప్రభుత్వ రంగ శాఖల మంత్రిగా సచివాలయంలో బాధ్యతలను స్వీకరించి సంతకం చేయనున్నారు. ఇప్పటివరకు ఈ మైనార్టీల శాఖ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వద్ద ఉండేది. తాజాగా ఈ శాఖను సీఎం రేవంత్ అజారుద్దీన్‌కు కేటాయించారు. దీంతో అడ్లూరి వద్ద SC, ST, BC, వికలాంగుల సంక్షేమ శాఖలు మిగిలాయి.