బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
SS: ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనకల్లు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు హరినాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ భర్త జయ కుమార్ నాయక్ ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో మరణించిన టీడీపీ కార్యకర్త బి. రమణ నాయక్, పాపిరెడ్డిపల్లికి చెందిన రెండు కుటుంబాలను కూడా ఎమ్మెల్యే పరామర్శించి, అండగా ఉంటా అని భరోసా ఇచ్చారు.