ఉత్తమ రూరల్ సీఐగా బీవీ రమణ

అన్నమయ్య: రాయచోటిలోని స్థానిక జిల్లా కలెక్టరేట్ నందు శుక్రవారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం రాయచోటి రూరల్ సర్కిల్ ఉత్తమ సీఐగా బీవీ రమణకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు.