VIRAL: విద్యార్థిని కర్రతో కొట్టిన ఉపాధ్యాయుడు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని వేద పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని కర్రతో అమానుషంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహర్షి సాందీపని జాతీయ వేద విద్యాసంస్థ వసతిగృహంలో తోటి విద్యార్థి బెడ్‌పై పడుకున్నాడనే కారణంతో బాలుడిని విచక్షణారహితంగా బాదాడు. ఆ విద్యార్థి నొప్పితో విలవిల్లాడుతూ.. తనను కొట్టొద్దని వేడుకున్నా ఆ టీచర్ కనికరించలేదు.