'బడిబాటను పకడ్బందీగా నిర్వహించాలి'
WNP: ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా 'బడిబాట' కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని AMO మహానంది తెలిపారు. పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాప్రతినిధులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా చదువు అందిస్తామన్నారు.