వర్ధన్నపేటలో మున్సిపల్ పన్నుల వసూలు వేగం
WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పన్నుల వసూలు వేగంగా కొనసాగుతోంది. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులతో పాటు సాక్షులు, ప్రతిపాదకులు సంతకం చేయాలంటే మున్సిపాలిటీకి సంబంధించిన ఆస్తి పన్ను, నీటిపన్ను తదితర బకాయిలు ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు. పెండింగ్ పన్నులు ఉన్నవారు ముందుగా వాటిని చెల్లించిన తరువాతే నామినేషన్ ప్రక్రియలో పాల్గొనాలి.